Chicken or Egg Question: “కోడి ముందా? గుడ్డు ముందా..?” అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని గందరగోళంలో పడేస్తోంది. పండితుల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం.. ఈ రోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను ప్రసవించి ఉండవచ్చని ‘ది టైమ్స్’ నివేదించింది. ఈ పరిశోధన వివరాలు ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నాంజింగ్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేసిన ఈ అధ్యయనం కీలక విషయాలు వెల్లడయ్యాయి.
READ MORE: Mahesh Babu : మహేష్ బాబు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్.. గ్లోబల్ మార్కెట్ ఏలేందుకు సూపర్ స్కెచ్!
బ్రిస్టల్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ స్కూల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో 51 జీవ శిలాజ జాతులు, అలాగే ప్రస్తుతం జీవిస్తున్న 29 జాతులను పరిశీలించారు. వీటిలో గుడ్లు పెట్టే జంతువులు (గట్టి లేదా మెత్తని గుడ్లు) అలాగే నేరుగా పిల్లలను కనేవి కూడా ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం.. అమ్నియోటిక్ (సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు) గుడ్డు అనేది ఉభయచరాల గుడ్లతో చాలా భిన్నంగా ఉంటుంది. ఉభయచరాల(నీటిలోనూ, భూమిపైనా జీవించగల జంతువులు) గుడ్లకు గట్టి పొర ఉండదు. అదనపు భ్రూణపు(పిండం) పొరలు కూడా ఉండవు. కానీ అమ్నియోటిక్ గుడ్డులో అమ్నియన్, కోరియన్, అలాంటాయిస్ వంటి భ్రూణపు పొరలతో పాటు బయట గట్టి లేదా కొంచెం మెత్తని పొర ఉంటుంది. కొన్ని జంతువుల గుడ్లకు గట్టి ఖనిజపు పొర ఉంటే, మరికొన్నిటికి పలుచని పొర మాత్రమే ఉంటుందని కనుగొన్నారు.
READ MORE: 2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!
ఈ అధ్యయనంలో చివరికి సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక మునుపు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవి. ఈ క్రమంలోనే పరిస్థితులు అనువుగా మారే వరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవి. ఆ తరువాత, నేలపై జీవనానికి అలవాటు పడే క్రమంలో గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతుల బల్లులు అప్పుడప్పుడూ నేరుగా పిల్లలకు జన్మనిచ్చి మిగతా సందర్భాల్లో గుడ్లు పెడతాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం కోడి ముందు అనేది సమాధానం వెల్లడైంది.