Giorgia Meloni: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియో మెలోని ధూమపానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. మెలోనిని ధూమపానం మానేయమని సలహా ఇచ్చారు. యూరోపియన్ మీడియా పొలిటికో ఈ విషయంపై నివేదించింది. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు మెలోని ఏ సిగరెట్ తాగుతుంది? అనే చర్చ జోరందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నెట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. […]
MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. […]
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇతని ప్రేమ వేధింపుల కారణంగా..…
QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వెల్లూరుకి చెందిన…
Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు.
Premanand Maharaj: ప్రేమానంద్ మహరాజ్ ఆరోగ్యంగా ఉండాలని మదీనాలో ముస్లిం వ్యక్తి ప్రార్థించాడు. బృందావనంలో నివసించే సాధువు త్వరగా కోలుకోవాలని ఇస్లాం మతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన మదీనాలో ప్రార్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుఫియాన్ అలహాబాద్ అనే యువకుడు ఈ వీడియో రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సర్వమత ఐక్యతకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 1 నిమిషం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సుఫియాన్…
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Muslim Population: భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. ఇది లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశంగా ఇండోనేషియా ఉంది. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో…
Cough Syrup Tragedy: కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చింద్వారాలో 24 మంది పిల్లల మరణాల కేసులో ఈ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అక్టోబర్ 8న, కోర్టు డాక్టర్ ప్రవీణ్ సోనికి బెయిల్ నిరాకరించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వడాన్ని నిషేధించిన 2023 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు పాటించలేదని కోర్టు పేర్కొంది. కోల్డ్రిఫ్ సిరప్‌ను పిల్లల ఔషధంగా సూచించినందుకు కంపెనీ తనకు 10 శాతం…