Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK Plan B: విజయ్ నేతృత్వంలోని టీవీకేలో తాజా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాల ముందు పార్టీ అధినేత విజయ్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో గెలిచిన వెంటనే పార్టీ హెడ్‌క్వార్టర్స్‌కు రావాలని అభ్యర్థులకు సూచించిన విజయ్, ఇప్పుడు మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్-బీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీవీకేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో పార్టీ కీలక నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి ఆదవ్ ఆర్జున, మాజీ మంత్రి సేంగోటియన్లతో కలిసి వ్యూహరచన చేస్తున్నారు. తమిళనాడులో హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో, అభ్యర్థులు చెదరిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మహాబలిపురంలో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. కౌంటింగ్‌కు ఒక రోజు ముందుగానే రిసార్ట్ బుక్ చేసిన విజయ్, గెలిచిన అభ్యర్థులు నేరుగా పూంజేరి రిసార్ట్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీవీకే అభ్యర్థులు ఇతర పార్టీల ప్రభావానికి లోనుకాకుండా కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఇక రేపు(సోమవారం) పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫలితాల ద్వారా కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్‌ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!