Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్‌ను ‘అన్‌ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ జితేష్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చేసిన “అన్‌ప్రొఫెషనల్” అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే, ఈ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించి, వివాదానికి తెరదించాడు. 15 ఏళ్ల వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనని, ఆ వయసులో ఉండాల్సిన అల్లరి, ఇష్టాలను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు. లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో “భవిష్యత్తులో భారత స్టార్‌గా ఎదిగే కుర్రాడు ఎవరు?” అని అడిగినప్పుడు, జితేష్ తడుముకోకుండా వైభవ్ పేరు చెప్పాడు. వైభవ్‌లో ఉన్న అద్భుతమైన టెక్నిక్, గట్టి మానసిక స్థితి, కఠోర శ్రమ అతడిని మూడు ఫార్మాట్లలోనూ మేటి ఆటగాడిగా మారుస్తాయని జితేష్ కొనియాడాడు. మైదానంలో ఎంతో పరిణతితో, ప్రొఫెషనల్‌గా కనిపించే వైభవ్.. బయట మాత్రం పూర్తి భిన్నమని జితేష్ చెప్పుకొచ్చాడు.
వైభవ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ.. “అతను నాకు తమ్ముడి లాంటివాడు. మా ఇంటికి వస్తుంటాడు, నా భార్యతో సరదాగా మాట్లాడతాడు. 15 ఏళ్ల పిల్లాడికి ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం ఉండదా? వాడు నా రూమ్‌కు వచ్చి ఐస్‌క్రీమ్ తింటాడు, కార్టూన్లు చూస్తాడు. వాడు నా దగ్గర ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంటాడు. బయట ప్రపంచం అతడి నుంచి ఎంతో వృత్తి నైపుణ్యాన్ని (Professionalism) కోరుకోవచ్చు, కానీ నా దగ్గర మాత్రం వాడు పిల్లాడిలాగే ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే వయసుకి తగినట్లుగా ఎంజాయ్ చేయమని, కేవలం బ్యాటింగ్ మీద దృష్టి పెట్టమని చెబుతుంటాను” అని జితేష్ వివరించాడు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, ఆ చిన్నారి తన బాల్యాన్ని కోల్పోకూడదన్నదే తన ఆకాంక్షని జితేష్ శర్మ మనసులో మాట చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!