Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- కర్ణాటక కేబినెట్ విస్తరణ
- 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
- మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా!
- గైర్హాజరుపై కొత్త ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగింది. 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. పైగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రుల ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కాకపోవడంతో విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వంలో కొత్త లుకలుకలు వినిపిస్తున్నాయి. డీకే.శివకుమార్-సిద్ధరామయ్య వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరుకాకపోవడం అధికార కాంగ్రెస్‌లో విభేదాల ఊహాగానాలకు కారణమైంది. అయితే పుట్టినరోజు కార్యక్రమాలు, ముందుగా నిర్ణయించుకున్న సమావేశాల కారణంగానే సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదని ఆయన వర్గం వివరణ ఇచ్చింది. అయితే కేబినెట్ విస్తరణలోని కొన్ని అంశాలపై సిద్ధరామయ్య అసంతృప్తితో ఉన్నందువల్లే ఆయన కార్యక్రమానికి హాజరుకాలేదని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
సిద్ధరామయ్య వ్యక్తిగత సహాయకుడు మాత్రం పుట్టినరోజు వేడుకలు, ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతోనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లలేదని తెలిపారు. అయితే మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్యకు అసంతృప్తి ఉందని కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. తనకు సన్నిహితంగా భావించే కొందరు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఆయన అసంతృప్తికి కారణమై ఉండవచ్చని సమాచారం.
వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని సిద్ధరామయ్య వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె అభ్యర్థిత్వానికి సిద్ధరామయ్య మద్దతు ఇచ్చారనే వార్తల్లో నిజం లేదని కూడా కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. తనకు సన్నిహితంగా ఉన్న పలువురు ఆశావహులకు మంత్రి పదవులు దక్కకపోవడమే ఆయన అసంతృప్తికి ప్రధాన కారణమని సమాచారం.
అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత జమీర్ అహ్మద్ ఖాన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా సిద్ధరామయ్యకు నచ్చలేదని వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలు కేబినెట్ విస్తరణ చుట్టూ రాజకీయ చర్చను మరింత పెంచాయి. అయితే ఈ అంశాలపై సిద్ధరామయ్య నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ గెహ్లాట్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి జీ. పరమేశ్వర హాజరయ్యారు. అజయ్ సింగ్‌తో పాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న పలువురు నేతలు మంత్రి పదవుల ప్రమాణ స్వీకారం చేశారు.
సిద్ధరామయ్య గైర్హాజరుపై ఊహాగానాలు
సిద్ధరామయ్య కార్యాలయం ఆయన గైర్హాజరుకు పుట్టినరోజు కార్యక్రమాలనే కారణంగా పేర్కొన్నప్పటికీ.. మంత్రివర్గ తుది కూర్పుపై ఆయన అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. గాయత్రి శాంతేగౌడకు మంత్రి పదవి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య సమర్థించలేదని సమాచారం. అయితే ఆమెను సిద్ధరామయ్యే మంత్రివర్గంలోకి తీసుకురావాలని కోరారనే ప్రచారాన్ని వర్గాలు తోసిపుచ్చాయి. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించిన తనకు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలకు అవకాశం దక్కకపోవడంపై సిద్ధరామయ్య అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జమీర్ అహ్మద్ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై కూడా ఆయనకు అభ్యంతరాలు ఉన్నట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కేబినెట్ విస్తరణ వెనుక కాంగ్రెస్ అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పుట్టినరోజు వేడుకలపై కూడా చర్చ
సిద్ధరామయ్య పుట్టినరోజు సందర్భంగా మరో పరిణామం కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా.. సిద్ధరామయ్యను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పలేదని వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పార్టీ అగ్రనేతల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా అనే ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ సందేశం లేదని సిద్ధరామయ్య సన్నిహితులు స్పష్టం చేశారు. పుట్టినరోజుకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాల కారణంగానే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లలేదని పునరుద్ఘాటించారు.
కర్ణాటక కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశించిన పలువురు కాంగ్రెస్ నేతలకు అవకాశం దక్కకపోవడంతో పార్టీలో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. కొందరు నేతలు అంతర్గత సమావేశాలు నిర్వహించగా.. మరికొందరు పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వర్గాలను సమన్వయం చేయడం, పార్టీ ఐక్యతను కాపాడటం కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త సవాలుగా మారింది. కేబినెట్ విస్తరణ అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఒకే కేబినెట్ విస్తరణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు కూడా ఒకసారి మంత్రి పదవి దక్కలేదని డీకే శివకుమార్ తెలిపారు. అయితే అనంతరం తనకు మంత్రివర్గంలో అవకాశం లభించిందని చెప్పారు. ‘‘అందరికీ ఒకేసారి అవకాశం కల్పించడం సాధ్యం కాదు. గతంలో నాకు కూడా మంత్రి పదవి దక్కలేదు. తర్వాత మంత్రిగా అవకాశం వచ్చింది. అలాగే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుంది’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు ఓపికగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!