Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ‘మైసా’ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఓ సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరాలు వెల్లడించారు. “గాయాలు అసలు నచ్చవు.. ఎవరికి తెలియకూడదని అనుకున్నా.. కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది” అంటూ రష్మిక తన పోస్ట్‌ను ప్రారంభించారు. వరుసగా ఇది తనకు మూడో గాయం అని, తన శరీరాన్ని మెషిన్లా కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలని పేర్కొన్నారు.
తనకు ఎదురైన గాయం గురించి వివరిస్తూ.. హిప్ ప్రాంతంలోని నాలుగు టెండన్లలో ఒకటి విడిపోయిందని, అది మళ్లీ కలిసే వరకు కాలు పైకి ఎత్తడం వంటి కదలికలు కష్టమవుతాయని అన్నారు. ఈ గాయం తన తాజా చిత్రం ‘మైసా’ షూటింగ్ సమయంలో డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా జరిగిందని వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్లోనే అత్యంత యాక్షన్, ఎనర్జిటిక్ మూవీగా అనిపిస్తోందని సరదాగా చెప్పారు. ప్రస్తుతం తనకు నొప్పి ఉన్నప్పటికీ భరించలేనంతగా లేదని, వైద్యుల సూచనలతో విశ్రాంతి తీసుకుంటున్నానని రష్మిక తెలిపారు. ఈ గాయాల కారణంగా వచ్చిన ఖాళీ టైంని ఫోర్స్డ్ హాలిడేగా భావిస్తున్నానని, ఖాళీ సమయంలో పజిల్స్ చేస్తూ గడుపుతున్నానని చెప్పారు. అలాగే వర్కౌట్స్, రన్నింగ్‌కు దూరంగా ఉండాల్సి రావడంతో బరువు పెరుగుతానేమోనని సరదాగా ఆందోళన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తానని రష్మిక చెప్పుకొచ్చారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
Hie guyssss!🥰❤️
Injuries suck.. 😩 and I was really hoping that no one will get to know.. but well 🐒🤷🏻♀️
Sorry I’ve been MIA 🐒 but hieeee! I’m hereeee!🙋🏻♀️😁
It happened awhile ago ya and this is my 3rd injury back to back.. 🤦🏻♀️
I should definitely learn to treat my body like a… pic.twitter.com/yJj70yEyAE— Rashmika Mandanna (@iamRashmika) August 3, 2026
తాజావార్తలు
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?