Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాస్తూ, సంచలనంగా మారాడు. క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన మొదటి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సుదర్శన్ 50 ఇన్నింగ్స్‌ల్లో 2178 పరుగులు సాధించగా, అంతకుముందు ఈ రికార్డు 2061 పరుగులతో క్రిస్ గేల్ పేరిట ఉండేది. కేవలం 24 ఏళ్ల వయసులోనే గేల్ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం. ఈ జాబితాలో మిచెల్ మార్ష్ (1933 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ గేల్ రికార్డును తుడిచిపెట్టడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే దాన్ని అందుకున్నాడు. 2026 సీజన్ ఆరంభంలో కాస్త నెమ్మదించినా, గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేసిన మెరుపు శతకం (100) అతని సత్తా ఏంటో నిరూపించాయి. 2022లో అరంగేట్రం చేసిన సుదర్శన్, ప్రస్తుతం 47.34 సగటు మరియు 148 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు సైతం అద్భుతంగా రాణించారు. జేసన్ హోల్డర్ 4 వికెట్లతో చెలరేగగా, సిరాజ్, రబడ చెరో రెండు వికెట్లు తీశారు. పంజాబ్ బ్యాటర్ సూర్యాన్ష్ షెడ్జ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 163 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ నిలకడైన ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. సుదర్శన్ రికార్డుల పరంపర చూస్తుంటే, అతను ఐపీఎల్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాడని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!