కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగుదేశం పాకిస్థాన్ తో అణుబాంబులు ఉన్నందున భారత్ ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించవచ్చు. పాకిస్థాన్‌కు సంబంధించి అయ్యర్ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది.
ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారసత్వ పన్ను, భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది.
శివ భక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఉదయం 7.10 గంటలకు కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్నగరి 'జై కేదార్' నినాదాలతో మారుమోగింది. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కేదార్నాథ్ దర్శనం కోసం తరలివచ్చారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ మ్యానిఫెస్టోను విడుదల చేస్తాయి. ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చే విధంగా వారిని ఆకట్టుకునే విధంగా పథకాలు రూపొందిస్తారు.
రాయణపేట జిల్లా పై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.
లింక్డిన్ పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ను లింక్డిన్ తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.