China: చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాన్ విధ్వంసం.. దెబ్బతిన్న 2,820 ఇళ్లు.. అయిదుగురి మృతి
- శుక్రవారం మధ్యాహ్నం హెగే నగరంలోని డాంగ్మింగ్.. జువాన్‌చెంగ్ నగరాలను తాకిన తుపాను
- 88 మందికి గాయాలు
- దెబ్బతిన్న 48 విద్యుత్ సరఫరా లైన్లు.. 4 000 హెక్టార్లకు పైగా పంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాను(టోర్నాడో) భారీ విధ్వంసం సృష్టించింది. తూర్పు చైనా ప్రావిన్స్ షాన్‌డాంగ్‌లోని ఒక నగరంలో సుడిగాలి కారణంగా ఐదుగురు మరణించారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం హెగే నగరంలోని డాంగ్మింగ్ మరియు జువాన్‌చెంగ్ కౌంటీలను తుపాను తాకింది. దీని కారణంగా 88 మంది గాయపడ్డారు. చైనా వార్తా సంస్థ ప్రకారం.. వీరిలో ఐదుగురి మృతి చెందారు. తుపాను కారణంగా 2,820 ఇళ్లు, 48 విద్యుత్ సరఫరా లైన్లు, 4,000 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా దక్షిణ మరియు గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు వంటి తీరప్రాంత ప్రావిన్స్‌లలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉండబోదని చైనా వాతావరణ పరిపాలక సంస్థ నివేదించింది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తీవ్రమైన ఉష్ణప్రసరణ వాతావరణం సుడిగాలికి కారణమైందని డాంగ్మింగ్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో తెలిపింది. స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర కార్యకలాపాలను ప్రారంభించింది. యూఎస్ తో పోలిస్తే.. సుడిగాలులు చైనాలో తరచుగా సంభవించవు. 1961 నుంచి 50 సంవత్సరాలలో దేశంలో కనీసం 1,772 మంది సుడిగాలి కారణంగా మరణించారని పరిశోధకులు చెప్పారు. ఏప్రిల్‌లో, ఒక సుడిగాలి దక్షిణ నగరమైన గ్వాంగ్‌జౌను తాకింది. ఈ విపత్తులో కనీసం ఐదుగురు మరణించారు.. 33 మంది గాయపడ్డారు.
READ MORE: Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు
కాగా.. గత నెలలోనే జులైలో విభిన్న వాతావరణం నెలకొంటుందని చైనా వాతావరణ శాఖ తెలిపింది. చైనాలో అనేక ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. పలు ప్రావిన్సుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇలా భిన్న వాతావరణ పరిస్థితులతో జులై నెలలో ‘అనేక ప్రకృతి విపత్తులు’ తప్పవని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!