పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు.
ఆగస్ట్ లో రైతు రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ బోగస్ మాటలు చెబుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. జూన్ లో రుణమాఫీ చేయాలని 5700కోట్ల రూపాయలు లేని ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను తిరిగి మోసం చేయాలని చూస్తోందన్నారు.
రేవంత్ రెడ్డికి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని.. అన్ని అబద్ధాలే మాట్లాడారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో ఏ రంగుతో పోటీ చేశానో, మెదక్ లో అదే రంగు తో పోటీ చేస్తున్ననని.. కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా.?