ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. . ఇది దేశంలోని ఆగ్నేయ తీరంలో ఉంది. ఈ నగరం ఆస్ట్రేలియా లోనే అతిపెద్దది. అద్భుతమైన నౌకాశ్రయం, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, శక్తివంతమైన జీవనశైలికి, పర్యటకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందరో ప్రయాణికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. కాగా.. సిడ్నీలో అద్దె ధరలు వేగంగా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ డొమైన్ ప్రకారం.. జూన్ 2024లో సిడ్నీలో సగటు అద్దె వారానికి సుమారు రూ. వేలల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలు కూడా ఎక్కువే. ఉదాహరణకు లకేంబా (Lakemba) లో.. అద్దెలు గత సంవత్సరం కంటే 31.6% పెరిగాయి.
READ MORE: Tamil nadu: తమిళనాడులో పీఎంకే పార్టీ కార్యకర్తపై హత్యాయత్నం
మీరు సిడ్నీకి వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటే.. ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు అక్కడ అద్దె మార్కెట్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇటీవల.. అక్కడ ఓ యజమాని తన ఇంటి బాల్కనీని దాదాపు నెలకు రూ. 80,000 లకు అద్దెకు ఇస్తానంటూ.. సోషల్ మీడియాలో పోస్ట చేశారు. అవును మీరు చదివింది నిజమే.. అది కేవలం ఓ ఇంటి బాల్కనీ రెంటు మాత్రమే.. మళ్లీ కరెంట్ , వాటర్ బిల్లు అదనమని రాసుకొచ్చారు. బాల్కనీకే అంత అద్దె ఉంటే.. పూర్తి ఇంటికి ఎంత ఉంటుందో అంచనా వేసుకోండి. ఆయన అద్దెకు ఇస్తానన్న ఈ గది నిజానికి రెండు పడకగదుల అపార్ట్మెంట్కు జోడించబడిన చిన్న బాల్కనీ. ఇందులో ఒకే మంచం, అద్దం, రగ్గు, కొన్ని ప్రాథమిక వస్తువులు ఉన్నాయి. గ్లాస్ స్లైడింగ్ తలుపులు దానిని మిగిలిన అపార్ట్మెంట్కు కనెక్ట్ చేస్తాయి. అలాగే.. మొత్తం స్థలం కావాలంటే.. అదే అపార్ట్‌మెంట్ వారానికి సుమారు రూ. 70,000కి అందుబాటులో ఉంటుంది.