ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఉత్సవాలు దాదాపు పదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే రథయాత్రలో శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా ఆరాధిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం విధియ తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. కాగా ఈ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో తొక్కిసలాట జరిగి ఒకరు మరణించడం విచారకరం. దాదాపు 300 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
READ MORE: Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం
పూరీ జగన్నథ రథయాత్ర ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ నగరం “జై జగన్నాథ్” నినాదాలతో మార్మోగుతోంది. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.