అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.
ఈ నెల 13న పోలింగ్ రోజు ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపుపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి జిల్లాకూ ప్రత్యేక పోలీస్ అధికారుల నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జరీ చేశారు. ఏపీ డీజీపీ హరీష్ ఉత్తర్వుల ప్రకారం.. 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు.
సార్వత్రిక ఎన్నికలల్లో ఘర్షణలు జరిగిన 15సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వివిధ కేసుల్లో 666మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టామని..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని చెప్పారు. బైండొవర్ కేసుల్లో ముద్దాయిలను జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. భారీ భద్రత CRPS బలగాలతో పల్నాడులో భద్రతను పెంచామని వెల్లడించారు. ఈనెల 4వ […]
తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘంపై బురదజల్లే ప్రయత్నం చేస్తు్న్నాయి. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని.. తరచూ ఆరోపిస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ఈసీ పలు వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా తప్పుడు కథనాల వ్యాప్తి, దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈసీ ఆరోపించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యప్తంగా చర్చ కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులను మ్యాజిక్ వాయిస్ యాప్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేసేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతి, అతని సహచరులు రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు.
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారానికి దూరమవుతాయని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్థులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది.