MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
- ప్రైవేటు స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్న రౌడీలు
- అడ్డుకునేందుకు యత్నించిన భూ యజమానులైన ఇద్దరు మహిళలు
- మహిళలపై డంపర్ తో మొరం గుమ్మరించి సజీవా సమాధికి యత్నిం
- గమనించిన చుట్టుపక్కల జనం
- మొరంలో కూరుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలో ప్రైవేట్ భూమిలో బలవంతంగా రహదారిని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మహిళలను రౌడీలు సజీవ సమాధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి పరిగెత్తారు. వారిద్దరి మీద పడిన మట్టిని తొలగించి బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
READ MORE: Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
Also Read
ఈ ఘటన రేవా జిల్లా మంగవాన్ పోలీస్ స్టేషన్ పరిధి.. గగేవ్ ఔట్‌పోస్టు పరిధిలోని హినౌతా జోరౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ కొందరు రౌడీలు ప్రైవేటు భూమిలో బలవంతంగా రోడ్డు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఒక జేసీబీ, రెండు టిప్పర్లు వినియోగించి ప్రైవేటు స్థలంలో మొరం వేస్తున్నారు. భూ యజమానులైన మమతా పాండే, ఆశా పాండే ఈ విషయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రైవేట్ భూమిలో రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు మహిళలు రోడ్డు నిర్మాణ స్థలం వద్ద నిలబడి నిరసన తెలిపారు. అప్పుడు డంపర్ డ్రైవర్ ఈ మహిళలపై మొరాన్ని గుమ్మరించాడు. మహిళలు ఒక్కసారిగా మొరంలో కూరుకుపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే మట్టిని తొలగించి లోపల నుంచి మహిళలను బయటకు తీసి చికిత్స కోసం గంగేవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. మహిళలకు ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. మట్టిలో కూరుకున్న వారిని సరైన సమయంలో బయటకు తీయకుంటే ప్రాణాలు పోయేవని ప్రజలు వాపోయారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
⚠️ ये भयावह वीडियो आपकी रूह कंपा देगा,
लेकिन मध्यप्रदेश की भाजपा सरकार, राष्ट्रीय महिला आयोग, प्रधानमंत्री, गृहमंत्री, महिला बाल विकास मंत्री इत्यादि की चुप्पी भी नही तुड़वा सकता।
रीवा में दो महिलाओं को निजी जमीन पर सड़क बनाने का विरोध करने पर दबंगों ने जिंदा जमीन में गाड़ा.. pic.twitter.com/a7AZujcwmU
— Srinivas BV (@srinivasiyc) July 21, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!