తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు.
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారానికి దూరమవుతాయని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్థులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది.
ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం... బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు.
జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అడ్డగోలుగా లిస్ట్ తయారు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారన్నారు.
కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు.