BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Elections: దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనిక, అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో (బీఎంసీ) తొలిసారి బీజేపీ మేయర్ పదవి దక్కించుకోబోతోంది. కేవలం బీఎంసీ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల మహాయుతి ఘన విజయం సాధించింది. ఠాక్రే సోదరులు సహా మొత్తం ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల తర్వాత బీఎంసీపై శివసేన పట్టు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం ఏమవుతుంది? ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన ఉనికిని కాపాడాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు కలిసినా.. వారిని మహారాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ముంబైలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.
READ MORE: Royal challengers vs Giants: ఆర్సీబీ హ్యాట్రిక్ విజయం.. 32 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపు
Also Read
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ఈ ఫలితాలు ఉద్ధవ్–రాజ్ జోడీని ముంబై ప్రజలు అంగీకరించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ జోడీ రాజకీయాలు ప్రజలకు ఆకట్టుకోలేకపోయింది. ఉత్తర భారతీయులపై జరిగిన హింస ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరాఠేతర ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ఠాక్రే సోదరులు విఫలమయ్యారు. మరోవైపు ముస్లిం ఓటర్లు ఈ కూటమికి దూరంగా ఉన్నారు. గత 25 ఏళ్లుగా మతోశ్రీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా జరుపుకునే సంబరాలు ఈసారి కనిపించలేదు. అక్కడ నిశ్శబ్దమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజ్ ఠాక్రేతో కలిసి రావడం ఉద్ధవ్‌కు నష్టమయ్యిందా? కాంగ్రెస్‌కు దూరంగా ఉండటం రాజకీయంగా భారమైందా? బాలాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో షిండేతో ఉన్న శివసేనపై ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారా? ఇక ముందు కూడా రాజ్–ఉద్ధవ్ కలిసి పోటీ చేస్తారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
READ MORE: OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
ఇక ఉద్ధవ్ ఠాక్రే శివసేన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అనంతంరం.. ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. మహావికాస్ అఘాడీ నుంచి దూరమై, పాత విభేదాలను పక్కనపెట్టి సోదరుడితో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆ వ్యూహం ఫలించలేదు. బాలాసాహెబ్ వారసత్వాన్ని పదేపదే ప్రస్తావించినా.. ఓటర్లు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. 25 ఏళ్లుగా బీఎంసీని పాలించిన శివసేనపై సహజంగా వ్యతిరేకత పెరిగింది. ఠాక్రే భారీ ర్యాలీలకన్నా ప్రెస్ కాన్ఫరెన్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలతో నేరుగా అనుసంధానం తగ్గింది. అంతే కాదు.. కేవలం మరాఠీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడం మిగతా వర్గాలను దూరం చేసింది. హిందీ భాషపై రాజకీయాలు, హిందీ మాట్లాడేవారిపై దాడులు, ముంబై మేయర్ తప్పనిసరిగా మరాఠీ వాడే కావాలన్న హామీలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. ఈ అన్ని అంశాలు కలిసి ఠాక్రే సోదరుల రాజకీయానికి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..