UP: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో హృదయ విదారక సంఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ ఢీకొని రెండున్నరేళ్ల చిన్నారి విషాదకరంగా మరణించింది. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్పూర్ గ్రామంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు..
RBI Update On RS. 2000 Notes: 2023 మే 19న రద్దు చేసిన 2000 రూపాయల గులాబీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డెట్ విడుదల చేసింది. ఇంకా ప్రజల నుంచి ఈ నోట్లు పూర్తిగా ఆర్బీఐకి చేరలేదని తెలిపింది. మూడు సంవత్సరాలకు పైగా గడిచినా..5,817 కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన ప్రకారం.. డీమోనిటైజేషన్కు అనంతరం 98.37% నోట్లు […]
KTR slammed Revanth Reddy: భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమన్నారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన […]
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. నాడు అధికారం…
Former CJI NV Ramana: గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐటీ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా భరించానన్నారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురయ్యిందన్నారు. రైతుల కష్టం, త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణం…
Happy Birthday Shahrukh Khan: నేడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. నవంబర్ 2న తన 60వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నిన్న రాత్రి నుంచి తన ఇంటి వద్దకు అభిమానులు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన సాయంత్రం 4 గంటలకు బాంద్రాలోని బాల గంధర్వ రంగమందిర్లో అభిమానులతో ప్రత్యేక సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షారుఖ్ 60 ఏళ్ల వయసులో సైతం ఫిట్గా కనిపిస్తారు.
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది.
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం లోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.…