గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
టీం ఇండియా ప్రధాన కోచ్‌కు సంబంధించి కొనసాగుతున్న ప్రకంపనల మధ్య, గంభీర్ స్పందించారు. భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా మారే ప్రశ్నపై గౌతమ్ గంభీర్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను అంత దూరం చూడడం లేదని అన్నారు.
ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఒక ప్రసిద్ధ ఔషధంలా పనిచేస్తుంది. ఇది జుట్టులోని చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు మెరుగవడానికి దశాబ్దాలుగా ఇంట్లోని ఉల్లిరసాన్ని ఉపయోగిస్తున్నారు.
హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్నాథ్ గుహలో శనివారం 'మొదటి పూజ' జరిగింది. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో ఉన్నారు. షేక్ హసీనాతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్, బంగ్లాదేశ్‌లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్ […]
సాధారణంగా వర్షాకాలం రైతులకు అతి ముఖ్యమైనది. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.
ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉరీ సెక్టార్‌లోని ఎల్ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.