-
KCR: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. -
Godavari Pushkaralu: 2027లో గోదావరి పుష్కరాలు.. రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు..
2027లో జరిగే పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 271 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లు పిలిచింది. -
MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్యూవీ.. లుక్ అదుర్స్
టయోటా ఫార్చ్యూనర్ ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్యూవీ సెగ్మెంట్. మరే ఇతర కంపెనీ ముందు దాని ముందు నిలవలేదు. అటువంటి పరిస్థితిలో ఫార్చ్యూనర్ ను సవాలు చేసేందుకు.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొదటి డీ ప్లస్ సెగ్మెంట్‌ను ఎస్యూవీ ఎంజీ మెజిస్టర్ను ఆవిష్కరించింది. మెజిస్టర్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. పొడవు, ఎత్తు కూడా బాగానే ఉంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. -
Best Selling Scooters: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లు ఇవే.. టాప్ వన్‌లో…
భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం.. -
Emergency: లండన్‌లో ‘ఎమర్జెన్సీ ‘కి అడ్డంకులు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది. -
MEA : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హాజరు.. స్పందించిన భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు. -
UP: గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు?
యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. బల్లియాలోని సాగర్‌పాలి గ్రామ సమీపంలోని గ్రామసభ వైన (రట్టుచక్)లో హైవే వైపున డ్రిల్లింగ్‌ను బృందం ప్రారంభించింది. అస్సాం నుంచి క్రేన్లు, పరికరాలు కొనుగోలు చేశారు. -
Republic Day Celebrations: భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఆయన భారత పర్యటన… -
IIT Baba: ‘గతజన్మలో నేను కృష్ణుడిని..’ ఐఐటీ బాబా సంచలన వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు ఆయన పలు వాదనలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. -
Kolhapuri chappals: భారత్‌లో తయారయ్యే చెప్పులకు పాకిస్థాన్‌లో క్రేజ్.. కారణం ఇదే..
షాహునగరి కొల్లాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..