Hyderabad Drug Party: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న […]
Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సానికి 6465 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ ప్రాంతం కాజీపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో 4150.. వరంగల్ ప్రాంతంలోని కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో 2315 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.. అధికారులు ఈ సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. వరంగల్ ప్రాంతం కంటే హనుమకొండ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో ఇళ్లతో పాటు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నట్లు ఇంజనీర్ల పరిశీలనలో తేలింది..
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కోటి దీపోత్సవం వేడుక కైలాసాన్ని తలపిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ, కార్తిక మాసానికి నూతన…
AP Private Bus Accidents: ఏపీలో ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. గత15 రోజుల్లో రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో బస్సు ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. గతంలో అడపా దడపా ప్రమాదాలకి గురయ్యే ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయాయి. ఈ బస్సుల్లో ప్రయాణానికి గ్యారెంటీ లేకుండా పోయింది. మొన్న కర్నూలు దగ్గర కావేరి ట్రావెల్స్ 19 మందిని బలి తీసుకుంది.
Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు.
Nalgonda Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి..
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు..
Nizamabad: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్‌లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
KTR: మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు జెండా ఎగురవేశారు. ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని పేర్కొన్నారు. "60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుంది. త్వరలోనే మణుగూరును సందర్శిస్థాను.. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం…
Mahabubnagar Government Teacher Suspended: ఓ ప్రభుత్వ టీచర్‌కి మద్యం టెండర్ లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. కానీ.. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం పోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే టీచర్ తాజాగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. రూ.3 లక్షల డిపాజిట్ చెల్లించి ధర్మాపూర్ వైన్స్‌కు దరఖాస్తు చేసుకున్న ఆమెకు అక్టోబర్ 26న జరిగిన […]