Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో మోనోరైలు రైలు పరీక్షా సమయంలో ప్రమాదానికి గురైంది. మోనోరైలు పట్టాలు తప్పడంతో దాని ముందు భాగం గాల్లోనే నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ, పరీక్ష సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద విషాదం తప్పింది. మోనోరైలు రైలు పట్టాలు తప్పి ఒక నిర్మాణాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. MMRDA, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
Government Warns Against Non-Standard Phone Chargers: ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లకు ఛార్జర్లను అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్ […]
Worlds Most Powerful Nuclear Bomb: 1945లో హిరోషిమాపై వేసిన అణు బాంబు కేవలం 15 కిలోటన్నుల TNTకి సమానం. అంటే 15,000 టన్నుల గన్పౌడర్కి సమానం. ఇది 70,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం మనం ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబు ఎవరి వద్ద ఉంది? యునైటెడ్ స్టేట్స్ వద్ద నిజంగా భారీ అణు బాంబు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం..
Tesla India: టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించి అధికారికంగా భారత్‌లోకి ప్రవేశించింది. తాజాగా ఎలోన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. గతంలో లంబోర్గిని ఇండియాకు నాయకత్వం వహించిన శరద్ అగర్వాల్‌ను భారత్‌కి కొత్త దేశ అధిపతిగా కంపెనీ నియమించింది. ఈ నిర్ణయం టెస్లా వ్యూహంలో ఒక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు. కస్టమర్ల నాడిని పట్టుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.
Ahmedabad Plane Crash: గతంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ప్రమాదం సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ఉండగా.. అందులో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. అది అందరికీ షాకిచ్చే విషయం.. అప్పట్లో ఆయనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెనకాలం మొత్తం పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తుండగా.. వాటి మధ్య నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ తెల్లటి రంగు టీషర్టులో బయటకు నడుచుంటూ…
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదిగాడు. కోహ్లీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రికార్డుల మీద రికార్డుల బద్దలుకొడుతూ గ్రేటెస్ట్ క్రికెటర్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఇవాళ 37వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ బ్యాటర్‌కు “కింగ్ కోహ్లీ” అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.. READ MORE: Students Carry Tent Equipment: విద్యార్థులతో టెంట్ […]
Kohli- Anushka Breakup Story: నేడు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు.. విరాట్ నవంబర్ 5, 1988న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న విరాట్ కోహ్లీ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..
Koti Deepotsavam Day 5: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది […]
Mohammad Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి శాఖలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మద్ అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.