Best Smartphones Under రూ.7,000: బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్, యూట్యూబ్ వీడియోలు, కాల్స్ వంటి సాధారణ అవసరాలకు సరిపడే ఫోన్ కావాలంటే రూ.7,000 లోపల కూడా మంచి ఎంపికలు ఉన్నాయి. Redmi, Lava, Tecno, IKALL వంటి నమ్మకమైన బ్రాండ్లు ఈ ధరలో ఉపయోగకరమైన ఫోన్లు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఐదు ఫోన్ల గురించి చూద్దాం.
READ MORE: Telangana: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు తెలంగాణ ప్రతినిధి బృందం..
1. Redmi A5 : రూ. 6,999
Redmi A5 రోజువారీ ఉపయోగానికి చాలా బాగుంటుంది. ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటంతో చేతిలో పట్టుకోవడం సులభం. ఈ ఫోన్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. అందువల్ల రోజంతా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. 8GB వరకు RAM, 2TB వరకు మెమరీ పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో 32MP AI డ్యూయల్ కెమెరాతో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీలు, సోషల్ మీడియా ఫోటోల కోసం ఇది సరిపోతుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. నీళ్లు, దుమ్ము పడినా కొంతవరకు సేఫ్ (IP52)గా ఉంటుంది.
2. Lava Bold N1 Pro : రూ. 6,798
Lava Bold N1 Pro మంచి పనితీరుతో వస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం సాఫీగా ఉంటుంది. 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది నీరు, దుమ్ము (IP54) నుంచి రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 4GB RAM ఉంది. అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్ చేస్తుంది. 128GB స్టోరేజ్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కెమెరా బాగుంది.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.. కొందరికి ఛార్జర్, డిస్‌ప్లే సమస్యలు వచ్చాయని చెప్పారు..
3. Lava O3 Pro : రూ. 6,599
Lava O3 Pro కూడా బడ్జెట్‌లో మంచి ఎంపిక. ఇందులో 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. వీడియోలు చూసేందుకు ఇది సరిపోతుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్ వల్ల సాధారణ పనులు సులభంగా చేయవచ్చు. ఈ ఫోన్‌లో 4GB RAM ఉంది, ఇంకా అదనంగా వర్చువల్ RAM సపోర్ట్ చేస్తుంది. 128GB స్టోరేజ్ ఉంది. 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సాధారణంగా వాడటానికి సరిపోతుంది. స్టోరేజ్ బాగుంది.. కొందరు యూజర్లు ఫోన్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు.. డిస్‌ప్లే సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి..
4. Tecno Spark Go 2 : రూ.6,699
Tecno Spark Go 2 లో ప్రత్యేకంగా Ella AI అనే వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది భారతీయ భాషలను అర్థం చేసుకుంటుంది. రిమైండర్లు పెట్టడం, చిన్న పనులు చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ఫోన్ IP64 సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే దుమ్ము, నీటి చినుకులను తట్టుకుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. గేమ్స్, వీడియోలు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. 5000mAh బ్యాటరీ ఉంది. డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. ఫోన్ వెంటనే స్వీచ్‌ఆఫ్ అయిపోతుందని కొందరు చెబుతున్నారు. ఛార్జింగ్ నెమ్మదిగా ఉందని ఫిర్యాదులు ఉన్నాయి.
5. IKALL Z10 : రూ. 6,499
IKALL Z10 తక్కువ ధరలో లభించే ఫోన్. ఇందులో 6.53 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. 2.0GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. రోజువారీగా వాడేందుకు సరిపోతుంది. ఈ ఫోన్‌లో 4GB RAM ఉంది. 20MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4000mAh బ్యాటరీ ఉంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తారు. డిజైన్ బాగుంది.. డిస్‌ప్లే, బ్యాటరీ పనితీరు అంతగా లేదని కొందరు చెప్పారు.. ఇదిలా ఉండగా.. రూ.7,000 లోపల ఫోన్ కొనాలంటే ఇవన్నీ మంచి ఎంపికలే. ఎక్కువ బ్యాటరీ కావాలంటే Redmi A5 లేదా Tecno Spark Go 2 మంచివి. కెమెరా ముఖ్యం అయితే Lava ఫోన్లు చూడొచ్చు. సాధారణ అవసరాలకు IKALL Z10 కూడా సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి ఈ ఫోన్లలో ఒకదాన్ని ఎంచుకోండి..