DCP Uday Reddy: గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టామన్నారు.. SM luxury కో లివింగ్ హాస్టల్ పై రైడ్ చేసినట్లు చెప్పారు. తేజ, లోకేష్ రెడ్డి అనే ఇద్దరు యువకులతో డ్రగ్స్ లభించాయన్నారు.. ఈ ఇద్దరినీ విచారించి రాబట్టిన సమాచారంతో హోటల్ నైట్ ఐలో ఉన్న వెన్నెల రవికిరణ్, హర్ష వర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్లను…
Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ట్రంప్…
Three major road accidents in India: మరికొన్ని రోజుల్లో 2025 ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది మిగిల్చిన దారుణాలు అన్ని ఇన్నీ కావు.. ఎన్నో ప్రమాదాలు జరిగాయి.. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు అనే మందిని మృత్యువు వెంటాడి వేటాడింది. మొన్న కర్నూలు, నిన్న జైపూర్, చేవేళ్ల ప్రమాదాలు తీవ్ర విషాధాన్ని మిగిల్చాయి. అయితే.. ఈ మూడు ప్రమాదాల్లో ఒక కీలక పాయింట్ ఉంది. ఈ మూడూ రోడ్డు ప్రమాదాలే అంతే కాదు.. ఈ ప్రమాదాల్లో…
Hyderabad Drug Bust: ముషీరాబాద్‌లో డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్ బయటపడింది.. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు.. ముగ్గురు మిత్రులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్.. ఢిల్లీ బెంగళూరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నాడు. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ను తెప్పించుకున్నాడు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు చేయగా ఓజి కుష్, ఎండిఎంఎ, ఎల్ఎస్డీ బాస్ట్స్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ డ్రగ్స్ స్వాధీనం…
Telangana MLAs Disqualification Hearings from Nov 6: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది.. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆరికెపూడి గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది.. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు.. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు…
Pakistan Family Celebrates India Women’s World Cup Win: టీం ఇండియా మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ పాకిస్థాన్‌లో సంబరాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ చారిత్రక విజయాన్ని వేడుక చేసుకుంటూ కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు కన్పించాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లో కేక్…
Srikakulam: నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్ చేసి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యాబుద్దులు నేర్చాల్సిన ఉపాధ్యాయురాలు బుద్ధి లేని పని చేసింది. చిన్న పిల్లల(విద్యార్థినులు)తో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది.
Hyderabad Drug Party: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న […]
Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సానికి 6465 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ ప్రాంతం కాజీపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో 4150.. వరంగల్ ప్రాంతంలోని కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో 2315 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.. అధికారులు ఈ సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. వరంగల్ ప్రాంతం కంటే హనుమకొండ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో ఇళ్లతో పాటు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నట్లు ఇంజనీర్ల పరిశీలనలో తేలింది..
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కోటి దీపోత్సవం వేడుక కైలాసాన్ని తలపిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ, కార్తిక మాసానికి నూతన…