కేంద్ర ఆరోగ్య మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రెండవ రోజు జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు పార్టీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
హెచ్ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ కుమార్ తన 33 నెలల జీతాన్ని తిరిగి జీతాల విభాగానికి అందజేశారు. సుమారు దాదాపు రూ. 23 లక్షలు తిరిగి ఇచ్చారు.
యాప్ ద్వారా క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా.. సొంతంగా మ్యాపింగ్ సర్వీస్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఇది గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించేది. ఇటీవల ఓలా మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ ప్లాట్‌ఫారమ్ నుంచి నిష్క్రమించింది.
నీట్-యూజీ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి.. తీర్పువెలువరించనుంది. నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలని.. పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.