నీట్-యూజీ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి.. తీర్పువెలువరించనుంది. నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలని.. పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు.
తాజాగా అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు రిఛార్జ్ ప్లాన్ ఛార్జీలను పెంచాయి. జులై మూడు నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్యతరగతి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.
వార్షాకాలం పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు నానడం వల్ల .. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన పాదాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. READ MORE: Saindhav Disease: సైంధవ్ సినిమాలో […]
పని ఒత్తిడిని తగ్గించుకుని కొన్ని రోజులు అలా చిల్ అవుదామని అందరూ అనుకుంటుంటారు. మార్పులేని జీవనశైలి నుంచి తప్పించుకోవాలని కోరుకుంటారు. అల సుదూర ప్రాంతానికి వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని భావిస్తారు.
లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు.