CM Mamata Banerjee: ‘నాకు కుర్చీ వద్దు.. రాజీనామాకు సిద్ధం…’
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఆందోళన చేస్తున్న వైద్యుల మధ్య సమావేశం
- కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యుల కోసం 2 గంటల వేయిట్ చేసిన సీఎం
- ఎంతకీ రాని వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్యులు కూడా ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి.. షరతులతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని.. అలాగే 30 మంది డాక్లర్లు వస్తారని.. చర్చలకు సంబంధించిన విషయాలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: KA Movie: ఆకట్టుకుంటున్న అందాల రాశి “తన్వీ రామ్”.. “క” లో రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆందోళన చేస్తున్న వైద్యుల మధ్య సమావేశం గురువారం కూడా జరగలేదు. ప్రభుత్వం మూడోసారి వైద్యులను చర్చలకు పిలిచింది. సిఎం మమతా బెనర్జీ కూడా చర్చల కోసం నబన్నలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యుల కోసం 2 గంటల పాటు వేచి ఉన్నారు. అయితే డాక్టర్ల ప్రతినిధి బృందం సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మొండిగా ఉండి సమావేశానికి హాజరు కాలేదు. వాస్తవానికి గురువారం నాడు మమత ప్రభుత్వం లేఖ రాసి సాయంత్రం 5 గంటలకు వైద్యులను చర్చలకు పిలిచింది. తన లేఖలో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కావాలన్న వైద్యుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే వారి షరతును ప్రభుత్వం తిరస్కరించింది. 30 మంది నిరసన తెలిపిన వైద్యుల ప్రతినిధి బృందానికి బదులుగా 15 మందిని మాత్రమే అనుమతించింది.
READ MORE: PM Modi: సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం
డాక్టర్లు చర్చల ప్రతిపాదనను అంగీకరించారు. నబన్న కూడా చేరుకున్నారు. ఈ సమావేశానికి 15 మందికి బదులు 32 మందితో కూడిన ప్రతినిధి బృందం వచ్చిందని, అనుమతి కూడా ఇచ్చామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. అంతేకాకుండా సమావేశాన్ని రికార్డు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ డాక్టర్ మాత్రం లైవ్ స్ట్రీమింగ్ విషయంలో మొండిగా ఉండడంతో కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్లలేదు. కాగా.. మమతా బెనర్జీ సమావేశానికి ఖాళీ కుర్చీల మధ్య రెండు గంటల పాటు ఒంటరిగా వేచి ఉన్నారు. దీని తర్వాత ఆమె వెళ్లిపోయియారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!