Gandipet Lake: గండిపేట నగరవాసులకు తాగునీరు అందించే వరప్రదాయిని, వరదల నుంచి సిటీని కాపాడుతున్న సరస్సు అయిన గండిపేట చెరువు ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట వద్ద కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువు నీటిలోకి వదిలే ప్రయత్నం చేస్తూ దొరికారు. ఇలా ఎన్ని రోజులు నుంచి డ్రైనేజీ వాటర్‌ను వదులుతున్నారనే సందేహం మొదలైంది. ఇలా జరగకుండా అధికారులు స్థానికులు గమనించాలని కోరుతున్నారు.
READ MORE: Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
వివరాల్లోకి వెళితే.. నిన్న(బుధవారం) హిమాయత్ నగర్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యతర్థాలను పారబోస్తున్నట్లు ఫిర్యాదు అందింది. హిమాయత్ నగర్ గ్రామంలో ఒక సెప్టిక్ ట్యాంక్‌ను అక్రమంగా ఖాళీ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిశీలనలో TG11 T 1833 నంబర్ గల సెప్టిక్ ట్యాంకర్ హిమాయత్ నగర్ గ్రామంలోని FTL పాయింట్ నం. 428 వద్ద ఉన్న ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారబోస్తూ కనిపించింది. దీంతో డ్రైవర్ రామావత్ శివ నాయక్‌ను పట్టుకుని విచారించారు. సింగరేణి కాలనీ, సైదాబాద్‌కి చెందిన శివ గండిపేట్ చెరువులో వద్దకు వచ్చి వ్యర్థాలను విడుదల చేయడం ఆందోళన కలిగించింది. ఈ ఘటన నిన్న(డిసెంబర్ 17న) ఉదయం సుమారు 8:00 గంటలకు హిమాయత్ నగర్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఎన్ని రోజుల నుంచి వ్యర్థాలను వదులుతున్నారు? అనే సందేహం మొదలైంది!!
READ MORE: GHMC Ward Delimitation: వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు.. అసలు ప్రాబ్లం ఏంటి?