ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఐజీ పీఅండ్ ఎల్గా ఎం రవి ప్రకాశ్ బదిలీ అయ్యారు.
తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్‌కు చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో గత 17 రోజులుగా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.
9వ తరగతి వరకు మాత్రమే చదివిన ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పుకుంటూ రోగులకు సర్జరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరంగా.. అతను గత 20 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాడు.
ఆన్లైన్ గేమింగ్ సంస్థ డెల్టా కార్ప్ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹ 142.20కి చేరుకున్నాయి. కంపెనీ తన హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వేరు చేస్తున్నట్లు ప్రకటించింది.
బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి. కెనడియన్ ఫోటోగ్రాఫర్ ప్యాట్రిసియా హోమోనియెల్లో.. తన ఉద్వేగభరితమైన ఫోటో 'వెన్ వరల్డ్స్ కొలైడ్' అగ్ర బహుమతిని కైవసం చేసుకున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు అజెండాలు సృష్టించి.. ప్రచారం చేస్తుందన్నారు.