వినయ్ మోహన్‌బాబుకు మొదటి బిడ్డ లాంటి వారని.. తనకు అన్న లాంటి వారని మంచు విష్ణు తెలిపారు. ఆయన్ని ఎవ్వరూ కొట్టే అంత ధైర్యం చెయ్యరని స్పష్టం చేశారు. “మా నాన్న ప్రతిసారి చెబుతారు.. భారత దేశంలో ఐఐటీలను ఛాలెంజ్ చేసిన ఘనత మోహన్ బాబు యూనివర్సిటీ కి ఉంది.. మా యూనివర్సిటీ ఓపెన్ బుక్ లాంటిది.. మా యూనివర్సిటీలో 53 శాతం.. అమ్మాయిలు ఉన్నారు.. ఆయన క్రమశిక్షణ ని నమ్మి అమ్మాయిలను పేరెంట్స్ అక్కడ జాయిన్ చేస్తున్నారు.. మాకు అది దేవాలయం.. దాని గురించి తప్పుగా మాట్లాడ్డం సరైంది కాదు.. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే అది కేవలం మమ్మల్ని ముగ్గుర్నీ అతిగా ప్రేమించడం.. నా వరకు నేను
ఎప్పటికీ అప్పటికి చెబుతూనే ఉన్నాము.. లక్ష్మి కి నాకు కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి.. కానీ మేము రెస్పెక్ట్ తో మెలుగుకుంటున్నం..”అని మంచు విష్ణు వెల్లడించారు.
READ MORE: RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి
మీడియాపై దాడి ఉద్దేశపూర్వకంగా జరగలేదని మంచు విష్ణు తెలిపారు. “నా ఇంట్లోకి వచ్చింది ఎవరు అని కోపంగా వస్తున్నారు.. ఆ కోపంలో జరిగినదే దురదృష్టకరమైన ఘటన.. బయట వాళ్ళకి ఇవ్వాళ 5 గంటల వరకు సమయం ఇస్తున్నాం.. మా కుటుంబం సమస్య మేము చక్కదిద్దుకుంటాం.. ఇంకా చాలు బయట వాళ్ళకి సంబంధం లేదు.. ఇవ్వాళ సాయంత్రం వరకు ఆగకపోతే అందరి పేర్లు బయట పెడుతము.. మా నాన్న గారు ఏం చెప్పినా నాకు వేదవాక్కు.. తప్పు చెప్పినా… ఒప్పు చెప్పినా ఆయన ఏది చెప్పినా చేస్తాను.. నేనెప్పుడూ మీడియా ముందుకు రాలేదు.. మా అసోసియేషన్ ఎలక్షన్ సమయంలో తప్పితే.. నాకు అవకాశం అంటే నిన్న మా నాన్న ఆడియో బయట కు వచ్చేది కాదు.. సమయం అన్నిటికీ సమాధానం చెబుతుంది.. ఏ కుటుంబం కొట్టుకోదు… ఏ కుటుంబం కలవదు.. మీకు అందరికీ బిగ్ బాస్ షో లాగా ఉంది.. నేను లాస్ ఏంజిల్స్ నుంచి 16 గంటలు ప్రయాణం చేసాను.. ఇంటర్నెట్ లేదు.. ప్రయాణం అంతా నరకం చూసాను.. నేను హైద్రాబాద్ లో ఉండి ఉంటే ఈ గొడవ అయ్యేది కాదు.. నాకు యూనివర్సిటీ… సినిమా… ఇదే నా ప్రపంచం..” అని ఆయన వ్యాఖ్యానించారు.