ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది.
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది.
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. […]
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక చర్యలు చేపట్టింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రాష్ట్రంలోని హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే సంస్థకు చెందిన 11 మంది అనుమానిత సభ్యుల స్థానాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
సూరత్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ల ట్యాంపరింగ్ కేసు బట్టబయలైంది. విచారణలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు విధ్వంసానికి సంబంధించిన మొత్తం కథను రూపొందించారని తేలింది.
ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.