హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు.
కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం ఉంటుంది. ఈనెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం 25వ తేదీన ఉదయం 10 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితాల ప్రకటిస్తారు.
READ MORE: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. పిటిషన్ వేస్తామన్న జైరాం రమేష్
ఇప్పటి వరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. పోటీలో ఉండబోమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేడు ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.. ఇప్పటివరకు దాఖలైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే.. ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 110 మంది ఓటర్లు ఉన్నారు.. 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంఐఎం నుంచి 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1ఎమ్మెల్సీలు, 40 కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లు ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లు, బీఆర్ఎస్ నుంచి 25 మంది ఓటర్లు, బీజేపీ నుంచి 22 ఓటర్లు ఉన్నారు.
READ MORE: Pharmacist Death: పార్మసిస్ట్ నాగాంజలి మృతి.. నిందితుడు దీపక్‌పై హత్య కేసు నమోదు చేస్తాం: డీఎస్పీ