-
Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుల అరెస్ట్..
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం..
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారని.. కాంగ్రెస్… -
Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయ్యిందని ప్రకటించారు. 24 వేల ఇండ్లు నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇండ్లు… -
MP Laxman: పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం?.. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఫైర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. -
Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు. -
Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు. -
PBKS vs RCB : ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ బ్యాటర్లు కుదేలు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26) టాప్ స్కోరర్. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18),… -
CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. -
IPL 2025: ఎలిమినేటర్ ఆడితే.. టైటిల్ కష్టమా?
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది. -
CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!