మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ మైదానంలోనే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా భారీ షాట్లు కొట్టడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చాలా పెద్ద కంపెనీలలో చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు.
రేపు సికింద్రాబాద్ - వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక , గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది.
సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా... సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు.
హాజరత్ మొహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగనంద్ సర్వతిని వెంటనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు నిరసనలు తెలుపుతున్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది.
ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. అపోస్మత్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో, కామలేశ్, రామకృష్ణ,నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు.
యూపీలోని వారణాసిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన వెనుక వెలుగు చూసిన విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి ఓ చేదు వార్త వచ్చింది. కంపెనీ బుకింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా, విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఎయిర్‌లైన్ బుకింగ్ సిస్టమ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభావితం కావడం ప్రారంభమైంది.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది.