Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు
- మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఖండించిన పీవీ నరసింహారావు సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
READ MORE: IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల అంశం బయటకు వచ్చింది.. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించకపోవడాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్‌రావు కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మనోహర్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు పీవీ నరసింహారావుకు ఎంత గౌరవం ఇచ్చిందో 20 ఏళ్లు వెనక్కి చూసుకోవాలి. సోనియా గాంధీ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు.. కాంగ్రెస్ ఆయనకు ఒక్క విగ్రహాన్ని నిర్మించలేదు. భారతరత్న కూడా ఇవ్వలేదు.. మీరు నరసింహారావు కోసం కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం గేట్లు కూడా తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధానికి మీరు ఇచ్చిన గౌరవం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పీవీ నరసింహ రావుకు కనీసం రెండు గజాల భూమి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని మనోహర్‌రావు మండిపడ్డారు. “మీరు పీవీ నరసింహ రావుకు చేసినట్లు మన్మోహన్ సింగ్ కు జరగలేదు. దేనికైనా కొంత ప్రక్రియ ఉంటుంది. బీజేపీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ప్రధానులు చనిపోయినా వారి పేర్లు ఢిల్లీలో లేవు. మోడీ ప్రధానమంత్రులను సత్కరించి.. ఒకే చోట మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మందికి భూమి కూడా ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ కు కూడా చోటు దక్కుతుంది. మీరు ప్రక్రియను పూర్తి చేయండి.” పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్‌రావు అన్నారు.
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?