Viral News: డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్ .. యువకుడు ఏం చేశాడో చూడండి..(వీడియో)
- పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులు
- ముంబైలో బయటకు వచ్చిన కేసు
- యువకుడి చాకచక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ యువకుడి చాకచక్యం చూసి దుండగుడే నవ్వుకున్నాడు. కొంత సమయం తర్వాత స్కామర్ స్వయంగా ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. జనాలు నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
వీడియో ప్రారంభంలో నేను అంధేరి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను అని నకిలీ పోలీసు అధికారి వీడియో కాల్‌లో చెప్పాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తికి ఇది డిజిటల్ అరెస్ట్ స్కాం అని తెలిసిపోయింది. దీంతో ఫోన్ కెమెరా మందుకు చిన్న కుక్కపిల్లని ఉంచాడు. కెమెరా ముందుకు రావాలని స్కామర్ అడుగుతాడు. దీంతో నేను కెమెరా ముందుకు వచ్చాను సర్..అని చెబుతూ.. కుక్క పిల్లను చూయిస్తూ.. ఇది తీసుకో సార్ అని అంటాడు. నకిలీ పోలీసు అధికారి ఆశ్చర్యపోయాడు. స్కామర్ కూడా నవ్వుతూ.. కెమెరాను ఆఫ్ చేస్తాడు. దుండగుడే ఫోన్ కట్ చేస్తాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు యువకుడు చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్‌లు..
ఇదిలా ఉండగా.. ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నారు. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సైబర్ నేరాలంటే.. పిన్ నెంబర్ తెలుసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేయడం, ఓటీపీ ద్వారా సొమ్మును దొంగిలించడం, పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్స్ వంటివి ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేరగాళ్లు సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుని కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది “డిజిటల్ అరెస్ట్”. ఈ పద్ధతిన నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత చదువులు చదినిన వారిని కూడా బురిడీ కొట్టిస్తున్నారు. మరి.. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ? దీని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇటీవల హైదరాబాద్ ఘటన..
ఇటీవల హైదరాబాద్ అడిక్‌మెట్‌కు చెందిన వృద్ధురాలి(85)కి గత నెల 26న ముంబయి పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నటి శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన మనీలాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయిందని బెదిరించాడు. నిన్ను ‘డిజిటల్ అరెస్టు’ చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా, ఎఫ్‌డీలు, పీపీఎఫ్ ఖాతాల్లోని రూ.5.9 కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడు. ఇలాంటి వందలాది ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు అనగానే భయపడి వారికి లొంగిపోతున్నారు.
అసలు ఎలా జరుగుతుంది..
గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ వేషధారణలో స్కైప్ లేదా వాట్సప్‌లో వీడియోకాల్ చేస్తాడు. తనను తాను సీబీఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమయిందని, మీపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సప్‌కు పంపిస్తాడు. అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, అందులో నగదు జమైనట్టు ఆధారాలు ఉండటంతో ఆయన కంగుతింటాడు. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర నేరం కావడంతో అరెస్టు తథ్యమని, బెయిలు కూడా దొరకదని, నెలల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుందని అవతలి వ్యక్తి భయపెట్టడంతో బాధితుడు వణికిపోతాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు ఫోన్‌కాల్‌ను బదిలీ చేస్తున్నానని చెబుతాడు. వెనువెంటనే మరో వ్యక్తి వీడియో కాల్‌లోకి వస్తాడు. తనను తాను సైబర్ క్రైమ్ ఎస్పీ లేదా ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. ‘మీరు డిజిటల్ అరెస్టు’ అయ్యారని, విచారణకు సహకరించాలని, నేరంలో మీ ప్రమేయం లేదని తేలితే కేసు నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతాడు. విచారణ పూర్తయ్యేవరకు వీడియో కాల్ ఆఫ్ చేయొద్దని, మరెవరితోనూ మాట్లాడొద్దని, మలమూత్ర విసర్జనకు వెళ్లినా తలుపు తెరిచే ఉంచాలని షరతులు విధిస్తాడు.
దొరికిందంతా దోచేస్తాడు..
చివరకు మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే.. డబ్బులను ఇవ్వాలని అంటారు. లేదంటే.. జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. ఇదంతా వింటున్న బాధితులకు ఏం చేయాలో అర్థంకాదు. ముందు ఆ సమస్య నుంచి బయటపడాలనే ఆరాటంలో.. వాళ్లు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా.. మనిషిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఒక స్క్రీన్ ముందు నిర్బంధించి దోచుకోవడాన్నే ‘డిజిటల్ అరెస్ట్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. కాగా.. దీనిపై తాజాగా పోలీసులు స్పందిస్తూ.. ఈ తరహా నేరాలు పెరిగాయన్నారు. తెలంగాణాలో ఈ డిజిటల్ అరెస్టులు పెరగడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!