కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా, సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది.
టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా "అనంతం". ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. అనంతం సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పాడు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది.
బంగారం ధర రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు.. బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 35 సార్లు చేరుకుంది. దాని వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాది బంగారం ధర 33 శాతం పెరిగింది. బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతోందనేది ప్రశ్న.
జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయిష్ బాన్ (డీబీ) తన గ్లోబల్ ప్రాజెక్ట్‌ల కోసం భారతదేశం నుంచి లోకో పైలట్లను నియమించుకోవడం ప్రారంభించింది. మెట్రో సిస్టమ్స్ కోసం కన్సల్టెన్సీ, ఆపరేషన్స్, మెయింటెనెన్స్‌ని అందించడం ద్వారా కంపెనీ భారతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనుకుంటోంది.
ఈ రోజుల్లో మనలో చాలా మంది వంట కోసం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగిస్తున్నారు. బొగ్గు, కలప వంటి సాంప్రదాయ వనరులతో పోలిస్తే.. ఎల్పీజీ సిలిండర్ వాడి వంట చేయడం చాలా సులభం. ఇది పోర్టబుల్ కాబట్టి.. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా పొదుపుగా ఉంటాయి.
నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ' ఆలోచించండి, చర్య తీసుకోండి' అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు.