ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు క్షత్రియ కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ రివార్డ్ ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదిలా ఉండగా.. లారెన్స్ ను ఎన్కౌంటర్ చేసినందుకు రివార్డ్ ప్రకటించడంతో ఆగ్రహించిన ప్రజలు కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి చేశారని సోషల్ మీడియాలో దీనికి చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ షాకింగ్ వీడియో బయటపడింది. ఇది బీర్ తాగేవారిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి స్థానిక మద్యం దుకాణం నుంచి బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు.
బంగ్లాదేశ్‌లో గార్మెంట్ రంగంపై ఆందోళన పెరిగింది. దీంతో యూఎస్ మార్కెట్లో భారత్ అడుగుపెట్టేందుకు అవకాశం లభించింది. భారతదేశం నమ్మకమైన వస్త్రాల తయారీ దేశంగా ఎదుగుతోంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.