బతుకు బండిని లాక్కెళ్లేందుకు ఒక్కొక్కరిది ఒక్కోక్క దారి. ఏదో ఒకలా సంపాదించి పొట్ట నింపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏదోలా నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకుంటారు. దొరికిన పని చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి తన రెండు చేతులు లేకున్నప్పటికీ తానే డెలివరీలు చేయడమే కాకుండా స్కూటర్‌ను స్వయంగా నడుపుతున్నాడు.
ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్తేరస్) సందర్భంగా రూ.12,850 కోట్లకు పైగా విలువైన వైద్య పథకాలకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
కేరళలో సోమవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ మధ్య వాహనంలో సీఎం కూడా కూర్చున్నారు. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు ముందు ఓ మహిళ అకస్మాత్తుగా స్కూటర్‌పై రావడంతో ఈ ఘటన జరిగింది.
నవంబర్‌లో బ్యాంకులకు సెలవుల జాబితా వచ్చేసింది. వచ్చే నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ 13 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉంటాయి. కొన్ని వేర్వేరు రాష్ట్రాల పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో మాత్రమే మూతపడతాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో కొందరు న్యాయవాదులు జిల్లా జడ్జిని ఆశ్రయించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు కోర్టు ఆవరణలోనే పోలీసులను పిలిచారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్‌ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్‌గా ఉంటుంది.
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.
యూపీలోని సుల్తాన్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. వివాహిత ప్రియురాలిని ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన ఆరేళ్ల చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు కడిపూర్ పోలీస్ ఏరియా ఆఫీసర్ (సిఓ) వినయ్ గౌతమ్ తెలిపారు.