దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సాంకేతికతతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన విద్యార్థిని ఆందోళన కలిగించింది. గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా.. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)లో శుక్రవారం రాత్రి (నవంబర్ 15) భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీమిండియా విజయంతో మెరిశారు.
మణిపూర్‌లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఇటీవల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ యొక్క ప్రైవేట్ వీడియోలు (MMS) వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది.
హర్యానాలోని సిర్సా జిల్లాలో ఒక అసాధారణ గేదె నివసిస్తుంది. దాని పేరు అన్మోల్. పేరుకు తగ్గట్టుగానే ఈ దున్నపోతు ఈ రోజుల్లో ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. 1500 కిలోల బరువున్న ఈ గేదె భారీ ఎత్తు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా చర్చనీయాంశంగా మారింది. అది తన పరిమాణానికే కాకుండా విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పుష్కర జాతరలో ప్రదర్శించబడింది. ఈ గేదె మీరట్‌లో జరిగిన ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్‌లో కూడా పాల్గొంది.
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. కాగా.. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్లో కురిసే మంచు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరిల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.