భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్.. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతి […]
స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.
గుట్టం బేగం పేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు మాట ఎవరైనా వినాల్సిందే అన్నారు.. కొందరు నేతలు గడ్డం పెంచుకుని రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని.. అందులో ఖాళీ పేజీలు ఉంటాయన్నారు. భారత సైన్యం వేషం వేసుకుని గుర్రాల మీద బీజేపీ ఆఫీస్‌కు వచ్చారన్నారు.
అమ్మ అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. ఆమె లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అందుకే మాతృమూర్తిని మించిన దైవం లేదనేది జగమెరిగిన సత్యం. అంతలా తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. కానీ నేటి కాలంలో నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలు ఇవేమి పట్టించుకోకుండా మాతృమూర్తులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అవసరమైతే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఏడాది తమ పాలనపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామన్నారు. కేటీఆర్ తప్పు చేశా అని ఫీల్ ఐతున్నాడు.. కాబట్టి జైలుకు పోతా అంటున్నాడన్నారు. "మేం విచారణ జరపకుండా నే.. జైలుకు పోతా అంటున్నాడు. కొన్ని నియోజక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి.. వాటిపై త్వరలోనే చర్యలు జరుపుతాం. పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ లో ఉన్న మాట వాస్తవం. మాది కార్యకర్తల పార్టీ..…
నార్సింగిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అల్కపూరి కాలనీ లో ఐడిపిఎల్ కు చెందిన రోహిత్ అనే యువకుడిని స్నేహితులు కొట్టి చంపేశారు. స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొనడానికి ఐడీపీఎస్ నుంచి అల్కాపూర్ కాలనీకి వచ్చాడు. బర్త్ డే పార్టీలో స్నేహితులు ఫుల్ గా మద్యం సేవించారు. అనంతరం రోహిత్ పై దాడి చేశారు.
భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరం వైభవంగా నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలో ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు.
ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌ను, బ్యాగును తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన ఈరోజు హింగోలి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు. "ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో నా హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.