యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో వారానికి 6 రోజుల పని నుంచి…
పతంజలి యాజమాన్యానికి సంబంధించి యోగా గురువు బాబా రామ్‌దేవ్ పెద్ద విషయం చెప్పారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు తాను గానీ, ఆచార్య బాలకృష్ణకు గానీ యజమాని కాదని బాబా రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో సైక్లింగ్ చేస్తున్న ఆయన కంపెనీ యాజమాన్య హక్కులకు సంబంధించిన మొత్తం విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సామ్రాజ్యం మొత్తం దేశ ప్రజలదేనని, వారే లబ్ధిదారులని అన్నారు. పతంజలి ఆస్తులపై కూడా కొందరికి చెడు చూపు ఉందన్నారు. స్వదేశీ కంపెనీ ప్రయాణం గురించి.. దాని సామ్రాజ్యం…
నెలకొక సారి అయినా ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్లు స్వంత ఊర్లకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెనుకబడ్డ వారి సమస్యలు అడిగి తెలుసుకోండని.. స్ఫూర్తి కలిగించండన్నారు. "లీడర్ అంటే లీడ్ చేసే వాడు. కానీ గృహ ప్రవేశాలు అంటూ దావత్ లు చేసుకుంటున్నామని బయటకు చెప్తున్నారు. దీపావళికి అందరూ చుచ్చుబుడ్డిలు వెలిగిస్తే.. కొంతమంది సారా బుడ్డిలు ఓపెన్ చేస్తూ... ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునే నిబంధనలు అతిక్రమిస్తుంటే... వాళ్ళనీ ప్రోత్సహిస్తున్నారు..
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలను ఇవ్వడానికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.ఈ అమృత్ నిధులు కేంద్రం నుంచి వస్తాయని.. కాబట్టి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. అమృత్ టెండర్ల పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ& మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగించారు. "మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు.
రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గజిబిజి లేకుండా సాఫీగా జరగాలని సూచించారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా అధికారులు చేరుకున్నారు.