తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించి…
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కోల్‌కతా మోడల్ తెల్లటి టవల్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మోడల్ సన్నతి మిత్రా.. టవల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. మిస్ కోల్‌కతా పోటీలో 2017 విజేతగా సన్నతి పేర్కొంది.
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ…
కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో కుంగిన భవనం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రస్తుతం ఒరిగిన భవనంతో పాటు.. ఆ చుట్టూ ప్రక్కల ఉన్న భవనాలు అన్నింటినీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే అని తేలింది. 50 నుంచి 100 గజాల లోపు ఉన్న చిన్న స్థలాల్లో 4, 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు భవన యజమానులు. నిర్మాణ సమయంలో ముడుపులు అందుకుని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. భవన యజమానులు ఒక్కో అంతస్తుకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు.
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. "కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకు పోయావ్. కాళోజీ నారాయణరావు…
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ రోడ్డులోని ఈవీ స్కూటర్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. షోరూంలో పార్క్ చేసిన వాహనాలన్నీ దగ్ధమైనట్లు సమాచారం.
మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై లైంగిక దాడికి యత్నించాడు. పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు.
బయట ఏం తిన్నాలన్న ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రతీ దాంట్లో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేరేడ్మెట్ గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని.. వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరినట్లు రవి అనే యువకుడు తెలిపాడు.