ఢిల్లీ-ఎన్సీఆర్లో విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. అయితే గత కొంత కాలంగా ఏటా చలికాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. చల్ల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వంటి కాలానుగుణ వాతావరణ పరిస్థితులు ఏటా ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.
పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. అయితే అధికారులు ఆమెను కాపాడారు. గత వారం మిర్పూర్ ఖాస్‌లోని కోట్ గులామ్ ముహమ్మద్ గ్రామంలోని ఇంటి బయటికి వెళ్లిన 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారు. బాలికను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారు. అనంతరం షాహిద్ తల్పూర్‌తో వివాహం జరిపించారు. అయితే.. హిందూ మైనారిటీలో […]
రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ ఏళ్లు గడవడంతో లబ్ధిదారుల్లో జరిగిన మార్పులను సవరించేందుకు ఈ-కేవైసీల ధ్రువీకరణ ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొంత మంది చనిపోయినా.. మరికొంత మంది పెళ్లి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడినప్పటికీ వారి పేరు మీద కుటుంబసభ్యులు రేషన్ తీసుకుంటూరట.
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు. ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు నువాపా జిల్లా దేవ్ధార గ్రామ సమీపంలో ఉంది.
ఆఫీసుల్లో, ఇళ్లలో కొంత మంది కుర్చీలకు అంటి పెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే.. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి..
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటిస్తున్నారు. వేముల వాడకు చేరుకున్న సీఎంకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్ఞాపికను అందించారు. రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం స్వామి వారికి కోడే మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామికి మొక్కులు చెల్లించి పూజలో పాల్గొన్నారు. నంది దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర […]