భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్‌లో జరుగుతున్న రెండో ఓడీఐలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఓడీఐలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో లివింగ్‌స్టన్ 32 బంతుల్లో 41 పరుగులు తీశాడు. దీంతో ఇంగ్లండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరోవైపు భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/35) అద్భుతమైన స్పెల్ వేశాడు. వరుణ్ చక్రవర్తి, షమి హర్షిత్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు. కాగా.. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
READ MORE: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టుకు గొప్ప ఆరంభం లభించింది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ కలిసి 10.5 ఓవర్లలో 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో డకెట్ కేవలం 36 బంతుల్లో తన అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని వరుణ్ చక్రవర్తి ముగించాడు. సాల్ట్‌ను ఔట్ చేశాడు. సాల్ట్ 29 బంతుల్లో 26 పరుగులకు వెనుదిరిగాడు.
READ MORE: Thandel : అదరగొడుతున్న నాగ చైతన్య.. బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న “తండేల్”
రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్