ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తున్నామని బి.సి సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఇది బి.సి ల ప్రభుత్వమని ఆమె చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆమె మాట్లాడారు.
READ MORE: Prince Harry: “ఇప్పటికే భార్యతో కష్టపడుతున్నాడు”.. అతడిని బహిష్కరించనని ట్రంప్ హామీ..
“లక్ష 32 వేల మందికి స్వయం ఉపాధిని కల్పించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నాం. లక్ష మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తాం. రాష్ట్రం లోని బి.సి హాస్టళ్లకు కొత్త రూపు తీసుకువస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో 108 బి.సి.గురుకుల పాఠశాలలు ఉన్నాయి. పులివెందులలో కూడా బి.సి.పాఠశాల పనులను మేమే పూర్తి చేస్తాం. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమరావతి.. పోలవరం… విశాఖ స్టీల్ ప్లాంట్.. ఉపాధి హామీ పథకానికి నిధులు వస్తున్నాయి. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం. గత పాలకుల వల్ల రహదారులు నిర్వీర్యమయ్యాయి. 27 వేల కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం నిధులను వెచ్చిస్తున్నాం. వై.సి.పి హయాంలో 47 వేల కోట్ల నిధులను వెచ్చించామని చెబుతున్నారు. ఆ నిధులు ఏమయ్యాయి? రాష్ట్రంలో జాతీయ రహదారులు అధికంగా టీడీపీ హయాంలోనే వచ్చాయి. గుంతల రహదారులకు మరమ్మతులు చేస్తున్నాం. 13 వేల కిలోమీటర్ల రహదారులను పీపీపీ రహదారులను అభివృద్ధి చేస్తాం. ఇంకా జాతీయ రహదారులు వస్తున్నాయి. ఆర్.అండ్.బి.శాఖ తలెత్తుకునేలా చేస్తాం.” అని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
READ MORE: Prince Harry: “ఇప్పటికే భార్యతో కష్టపడుతున్నాడు”.. అతడిని బహిష్కరించనని ట్రంప్ హామీ..