తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్వంత్‌సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది.
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది.
ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాక్ వివాహ చట్టంలో మార్పు గురించి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఇరాక్ ప్రభుత్వం వివాహ చట్టంలో చేయబోయే మార్పుల ప్రకారం.. ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల కొద్ది వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరికొన్ని కోపాన్ని సృష్టిస్తాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.
అమెరికాలోని మిల్వాకీ నగరంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. వీడియో గేమ్‌లో ఓడిపోయాడన్న కారణంతో ఓ తండ్రి తన 8 నెలల నవజాత కుమారుడిని గోడకు విసిరేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని మహిళ చెప్పింది.
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది.