బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన రైల్వే లైన్ సర్వే ఇప్పుడు ఖరారైంది. తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం తుది సర్వే పూర్తయింది. సర్వే ప్రకారం..170 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49000 కోట్లు ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే.. భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరుకోగలవు.
కొంత మంది ఉదయం లేవగానే టాయిలెట్‌కు వెళ్లి అరగంట వరకు బయటకు రారు. ఇక బయట ఉన్నవాళ్లకు మాత్రం వారు టాయిలెట్‌పై నిద్రిస్తున్నారా? అని సందేహిస్తుంటారు. మరి కొందరైతే ఫోన్, న్యూస్ పేపర్లు తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతుంటారు ఎక్కువ సేపు కూర్చుంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే మానేయండి.. లేదంటే రోగాల బారిన పడక తప్పదు.
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డీఎస్సీ సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుంచి ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్పై కేసు నమోదు అయ్యే ఛాన్స్‌తో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ చేయనున్నారు.
నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు.
సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ అరెస్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. "శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి వివరించాను. పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లను…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో […]