‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
READ MORE: Health Tips: ఇంగువతో స్పెషల్ అరోమా మాత్రమేకాదు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘డోంట్ నో వై’ అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్, ఐశ్వర్య సురేష్ కలిసి తెలుగు, తమిళ భాష్లలో ఈ గీతాన్ని ఆలపించారు. ‘డోంట్ నో వై’ పాటతో ప్రేక్షకును కట్టిపడేశారు అనిరుధ్. అనిరుధ్ తన సంగీతంతో మాత్రం కాకుండా, గాత్రంతోనూ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ‘మ్యాజిక్’ అనే చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఈ గీతానికి తెలుగులో కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, తమిళంలో విఘ్నేష్ శివన్ సాహిత్యం అందించారు. ఆ సంగీతానికి తగ్గట్టుగానే, ఆకట్టుకునే విజువల్స్ తో ‘డోంట్ నో వై’ మ్యూజిక్ వీడియోను ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా మలిచారు. పాటను వినేద్దాం… పదండి..
READ MORE: Off The Record: తమ వాళ్ళకే పదవులంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒత్తిడి చేశారా..?