భారతదేశంలో ఎక్కువగా ఆదరణ పొందింన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. చాలా మంది పానీపూరీను ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళల్లో పానీపూరీ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఏరియాను బట్టి పానీపూరి వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పా వంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు. మీకు పానీపూరి అంటే ఇష్టమా? అయితే వారి కోసం ఓ బండి యజమానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు.
READ MORE: CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా
నాగ్‌పూర్‌కు చెందిన పానీపూరి విక్రేత ఒక ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చారు. రూ. 99,000 చెల్లిస్తే.. కస్టమర్‌కు జీవితాంతం ఉచిత పానీపూరి అందిస్తామని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం.. నగదు చెల్లించిన కస్టమర్లు ఎప్పుడైనా స్టాల్‌కి వచ్చి ఉచితంగా తినవచ్చు. పానీపూరిలపై పరిమితి కూడా లేనట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ వైరల్ కావడంతో ఇప్పటికే ఇద్దరు నగదు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. అయితే, ప్రజలు ఈ ఆఫర్‌ను మార్కెటింగ్ ట్రిక్ అని పిలుస్తున్నారు.
ఈ ఆఫర్ గురించిన సమాచారం @marketing.growmatics ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 47 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది దానిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. కొంతమంది దీనిని తమాషాగా భావించారు. మరికొందరు దానిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఆఫర్ జీవితాంతం ఉంటుందా? దుకాణం ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. దుకాణదారుడి అసలైన ఉద్దేశ్యం ప్రచారం చేయడం, వైరల్ అవ్వడం అని కొంత మంది చెబుతున్నారు.