ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
దేశ రాజధానిలో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా […]
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన రైల్వే లైన్ సర్వే ఇప్పుడు ఖరారైంది. తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం తుది సర్వే పూర్తయింది. సర్వే ప్రకారం..170 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49000 కోట్లు ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే.. భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరుకోగలవు.
కొంత మంది ఉదయం లేవగానే టాయిలెట్‌కు వెళ్లి అరగంట వరకు బయటకు రారు. ఇక బయట ఉన్నవాళ్లకు మాత్రం వారు టాయిలెట్‌పై నిద్రిస్తున్నారా? అని సందేహిస్తుంటారు. మరి కొందరైతే ఫోన్, న్యూస్ పేపర్లు తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతుంటారు ఎక్కువ సేపు కూర్చుంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే మానేయండి.. లేదంటే రోగాల బారిన పడక తప్పదు.
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డీఎస్సీ సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుంచి ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.